పవన్‌ మానియా… సోషల్ మీడియాను ఊపేస్తున్న pspk26…!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆయన ఫాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన సినిమా కోసం ప్రతీ క్షణం ఒక యుగంలా గడుపుతారు ఆయన అభిమానులు. ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేస్ ఉన్న నేపధ్యంలో ఆయన సినిమా అనగానే ఒక క్రేజ్ ఆటోమేటిక్ గా ఉంటుంది. ఎప్పుడో రెండేళ్ళ క్రితం అంటే 2018 సంక్రాంతికి వచ్చింది పవన్ సినిమా.

PSPK 26అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయాల్లోనే ఉండిపోయారు. ఇక ఇప్పుడు మళ్ళీ తనను నమ్ముకున్న వారి కోసం సినిమాలు చెయ్యాలని భావిస్తున్న పవన్… వేణు శ్రీరాం దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ అనే సినిమాను తెలుగులో చేయడానికి ఆయన అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్ కి కూడా కొన్ని ఇబ్బందులు పడుతూనే పాల్గొన్నారు పవన్.

ఇప్పుడు ఆయన పార్ట్ షూటింగ్ దాదాపుగా అయిపోయింది అనేది టాలీవుడ్ జనాల మాట. ముందు నుంచి అనుకున్న విధంగానే టైటిల్ ని వకీల్ సాబ్ గా ఖరారు చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా లుక్ వస్తుంది అనగానే సోషల్ మీడియా ఊగిపోతుంది. ఫాన్స్ సెకన్లు కూడా లెక్కపెట్టుకుని పోస్ట్ లు పెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లో ఆయన ఫాలోయింగ్ ఉంది. దీనితో ఫాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫీవర్ తీసుకొచ్చారు. పనులు మానుకుని ఎదురు చూస్తున్నారు ఈ లుక్ కోసం.

Read more RELATED
Recommended to you

Latest news