విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాథ్ సినిమాకు ఆ టైటిల్ క‌న్‌ఫార్మ్‌..!

758

ఎట్ట‌కేల‌కు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆరు వ‌రుస ప్లాపుల త‌ర్వాత పూరికి హిట్ వ‌చ్చింది. కేవ‌లం రూ.17 కోట్ల‌కు అమ్మిన ఇస్మార్ట్ శంక‌ర్ డ‌బుల్‌కు మించి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఆ హిట్ ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు పూరి కొత్త సినిమాపై ఎనౌన్స్ మెంట్ కూడా చేసేశాడు. ఈ సినిమా చాలా మంది త‌ల‌రాత‌ల‌ను మార్చేసింది. ప్లాపుల్లో ఉన్న రామ్‌, పూరి, నిర్మాత‌గా చార్మీకి బాగా క‌లిసొచ్చింది.

Puri Jagannath Vijay Devarakonda New Movie Title Fighter
Puri Jagannath Vijay Devarakonda New Movie Title Fighter

రూ.17 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ ఏకంగా రూ.40 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఈ సినిమా జోష్‌తో పూరి త‌న నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల డియ‌ర్ కామ్రేడ్‌ సినిమాతో నిరాశ‌ప‌రిచిన‌ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో పూరి ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను పూరి – చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ అవ్వ‌కుండానే సినిమా టైటిల్‌పై పూరి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ అప్పుడే టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో లీక్ కూడా అయ్యింది. పూరి ఈ సినిమాకు ఫైట‌ర్ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇస్మార్ట్ శంక‌ర్‌తో మాస్‌ను టార్గెట్ చేసిన పూరి మ‌రోసారి విజ‌య్ సినిమాకు సైతం అదే స్టైల్ క‌థ‌తో రావాల‌నుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. డిసెంబ‌ర్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్లే ఈ సినిమాను వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. విజ‌య్ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్లు న‌టించనున్నారు. పూరి ప్ర‌స్తుతం హీరోయిన్ల వేట‌లో మునిగిపోయాడు.