ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. పదో తరగతి షెడ్యూల్ ని విడుదల చేసిన కొద్దిసేపటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. మార్చి 01 నుంచి మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే ఫిబ్రవరి 03న ఎన్విరాన్ మెంటల్ పరీక్ష జరుగుతుందని తెలిపారు.

మొదటి సంవత్సరానికి సంబంధించి మార్చి 01న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 04న ఇంగ్లీషు, మార్చి 06న మ్యాథ్స్, బొటనీ, సివిక్స్, మార్చి 08న మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ, మార్చి 11న ఫిజిక్స్, ఎకానమీ, 13న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్, మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జీ కోర్సు మ్యాథ్స్,  మార్చి 19న మోడర్న్ లాంగ్వేజీ, జియోగ్రఫీ పేపర్లు జరుగుతాయి.

అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మార్చి 02న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 05న ఇంగ్లీషు, మార్చి 07న మ్యాథ్స్, బొటనీ, సివిక్స్, మార్చి 10న మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ, మార్చి 12న ఫిజిక్స్, ఎకానమీ, మార్చి 15న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్, మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జీ కోర్సు మ్యాథ్స్,  మార్చి 20న మోడర్న్ లాంగ్వేజీ, జియోగ్రఫీ పేపర్లకు సంబంధించి పరీక్షలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version