ఆ అమ్మాయిని దారికి తెచ్చుకునేందుకే ఫోటోలు తీసి భయపెట్టా .. పోలీసుల విచారణలో పుష్ప ఫేం జగదీష్

-

ఇటీవల ఓ యువతి ఆత్మహత్యకు కారణమైన పుష్ప ఫేం జగదీశ్ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న అతణ్ని వారు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా అతను ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు. గతంలో తనతో సన్నిహితంగా ఉన్న యువతి మరొకరికి దగ్గరవడం భరించలేక.. మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె ఫొటోలు తీసి భయపెట్టానని జగదీశ్‌ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చిన జగదీశ్‌కు అయిదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయమైంది. కొంతకాలానికి అది ప్రేమగా మారి శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలో పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు రావటంతో సినిమా అవకాశాలు పెరిగి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇది నచ్చని యువతి మరో యువకుడికి దగ్గరవ్వడంతో ఏదో విధంగా ఆమెను మళ్లీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు జగదీశ్. గత నెల 27న పంజాగుట్ట ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వెళ్లి ఆ సమయంలో సదరు యువకుడితో ఆమె సన్నిహితంగా ఉండటం చూసి ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. ఆమె భయపడి గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమె తండ్రి ఫిర్యాదుతో జగదీశ్ను ఈనెల 6న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించి అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే నిందిడును నేరాణ్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news