వేములవాడలో ఇవాళ, రేపు ఆర్జిత సేవలు బంద్

-

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు ఆలయ అధికారులకు అలర్ట్ జారీ చేశారు. రెండ్రోజుల పాటు ఆలయ గర్భగుడిలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కొనసాగనున్న నేపథ్యంలో జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలోనే భక్తుల రద్దీ దృష్ట్యా జాతర పూర్తయ్యేంత వరకు ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలను నిలిపేస్తున్నట్లు ఈవో కృష్ణ ప్రసాద్ చెప్పారు. శుక్ర, శనివారాల్లో ‘సమ్మక్క సారలమ్మ’ భక్తుల తాకిడి తక్కువగా ఉంటే మిగిలిన భక్తులకు గర్భ గుడిలో అభిషేకం, అన్న పూజల మొక్కులు చెల్లించుకునేందుకు టికెట్లు జారీ చేస్తామని తెలిపారు. మిగిలిన రోజుల్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని, ఆర్జిత సేవల వివరాలు దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఈవో కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. భక్తులంతా ఈ విషయం గ్రహించి ప్రశాంతంగా స్వామి వారి దర్శనం చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news