పుష్ప మేనియా.. బంగ్లాదేశ్ లీగ్ లో బ్రావో శ్రీవ‌ల్లి స్టెప్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రెజ్ రాష్ట్రాలే కాదు.. దేశాల‌ను దాటుతుంది. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రెటీలు, క్రికెట‌ర్లు పుష్ప సినిమాలోని డైలాగ్స్, స్టెప్స్ వేసి అల‌రించారు. తాజా గా వెస్టిండీస్ ఆల్ రౌండ‌ర్ డ్వెన్ బ్రావో కూడా పుష్ప సినిమాలోని శ్రీ‌వ‌ల్లి పాట‌లోని స్టెప్స్ వేశాడు. అయితే ఈ స్టెప్స్ ఇంట్లో, పార్టీలో కాదు.. కాకండా కాస్త భిన్నంగా ఏకంగా మైదానంలోనే బ్రావో ఈ డ్యాన్స్ చేశాడు. కాగ బంగ్లాదేశ్ ప్రిమియ‌ర్ లీగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ లీగ్ లో భాగంగా ఫార్చున్ బార్ష‌ల్స్, కుమిల్ల వారియ‌ర్స్ జ‌ట్లు ఈ రోజు త‌ల‌ప‌డుతున్నాయి.

కాగ డ్వేన్ బ్రావో ఫార్చున్ బార్ష‌ల్స్ జ‌ట్టు త‌రుపున ఆడుతున్నాడు. కాగ కుమిల్ల వారియ‌ర్స్ బ్యాట్స్ మెన్ మ‌హ్మ‌దుల్ల వికెట్ తీసిన త‌ర్వాత డ్వేన్ బ్రావో పుష్ప సినిమాలోని శ్రీ‌వ‌ల్లి పాట‌లో అల్లు అర్జున్ వేసిన స్టెప్ ను వేశాడు. దీంతో ఆ వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేక్షం అయింది. కాగ ఈ వీడియో ప్ర‌స్తుతం ఫుల్ వైర‌ల్ అవుతుంది. అలాగే గ‌త రెండు రోజుల క్రితం ఇదే లీగ్ లో అమిత్ హ‌స‌న్ అనే ఆట‌గాడు కూడా త‌గ్గేదే లే అనే డైలాగ్ ను మైదానం చెప్పి అల‌రించాడు. కాగ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో నుంచి హాలీవుడ్ హీరోకు అప్ గ్రెడ్ అయ్యాడ‌ని అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అలాగే అల్లు అర్జున్ క్రెజ్ రోజు రోజుకు పెరుగిపోతుంద‌ని కామెంట్ పెడుతున్నారు.