తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య విజయం సాధించగా…నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే… ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థి మాత్రం గెలువ లేదని చెబుతున్నారు.

అటు కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయట. ముఖ్యంగా నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇక్కడ మూడో స్థానానికి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ సన్నిహితుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పరిమితమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయింది.