పుష్ప-2 రిలీజ్ డేట్ పై మార్పు లేదు.. అప్పుడే రిలీజ్ చేస్తాం !

-

పుష్ప-2 రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పు లేదని ప్రకటించారు ప్రొడ్యూసర్ రవి శంకర్. ముందుగా చెప్పినట్టే డిసెంబర్ 6న విడుదల అవుతుందన్నారు ప్రొడ్యూసర్ రవి శంకర్. కాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైజ్ సినిమా ఎంతటి విజయాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప-2 ది రూల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన పుష్ప, పుష్పరాజు అనే టైటిల్ సాంగ్ తో పాటు సూసేటి అగ్గి రవ్వ అనే కపుల్ సాంగ్ ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news