కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం ఆయన నగరంలోని కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌లో అగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పరిశీలించారు. అక్కడ సీఎం రేవంత్ మొక్క నాటి హరిత స్ఫూర్తిని చాటుకున్నారు.

2013లో కుతుబ్‌షాహీ వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును అగాఖాన్‌ ఫౌండేషన్‌ చేపట్టగా.. రాష్ట్ర సాంస్కృతిక శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నేతలు టూంబ్స్ సందర్శించారు. మరోవైపు ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. జైపాల్‌ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version