కేరళలో రాధ కుమార్తె కార్తీక వివాహం… హాజరైన చిరంజీవి, సురేఖ

-

మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ పెళ్లి పీటలు ఎక్కారు. టాలీవుడ్‌ సీనియర్ నటి రాధా కుమార్తె, హీరోయిన్ కార్తిక నాయర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న ఉదయం రోహిత్ మేనన్ తో మూడు ముళ్ళ బంధం లోకి అడుగుపెట్టింది కార్తిక. ఈ తమిళనటి పెళ్లి తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్ లో….కేరళ సాంప్రదాయంలో జరిగింది.

Radha’s daughter Kartika’s wedding in Keral

వీరి వివాహానికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరోయిన్ రాధిక, సుహాసిని, రేవతి తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను నటి రాధిక తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ (2009) సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కార్తిక. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ…. ఈమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version