Radhe Shyam Review : “రాధే శ్యామ్” రివ్యూ.. డార్లింగ్ ఇరగదీశాడుగా

-

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను… టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టించింది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. ఇక విడుదల అయినప్పటి నుంచి.. సినిమా పై ఇంకా క్రేజ్ పెరిగింది.

కథ : రాధే శ్యామ్ సినిమా 1976లోని ఓ యదార్థ సంఘటన. కొన్ని పరిస్థితుల కారణంగా విక్రమ్ ఆదిత్య (ప్రభాస్).. ఇటలీకి పారిపోతాడు. భారతదేశంలోనే విక్రమ్ ఆదిత్య నెంబర్ 1 పామిస్ట్. ఇటలీ వెళ్ళిన విక్రమ్ ఆదిత్య ప్రేరణ (పూజ)ని కలుస్తాడు. అంతే కాదు మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ప్రేర‌ణ కూడా విక్ర‌మ్‌తో ఎలా ప్రేమ‌లో ప‌డుతుంది, వారి జీవితాల్లో విధి, విధి ఎలా పాత్ర‌ను పోషిస్తుంద‌నేది క‌థ‌. అలాగే పామిస్ట్ గా విక్రమ్ ఆదిత్య ఏం చేస్తాడు అనేది బాగా తీశారు దర్శకులు.

నటీనటుల నటన

దాదాపు దశాబ్దం తర్వాత ప్రభాస్.. లవ్ డ్రామా జోనర్‌ సినిమా చేశాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రొమాంటిక్ లవర్ బాయ్‌గా నటించాడు. పూజా హెగ్డే బిగ్ స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ప్రభాస్ – పూజ జంట మధ్య కెమిస్ట్రీ పంచ్ లేదు. భాగ్యశ్రీ నటన సరిపోతుంది. జగపతిబాబు పాత్ర అవసరమే లేదు. ప్రియదర్శి, కృష్ణంరాజు, సత్యరాజ్, రిద్ధి కుమార్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రధాన తారాగణం చాలా బాగుంది. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ సరైన లవ్ డ్రామా సబ్జెక్ట్‌ని రాసుకున్నాడు. పాటలు బాగా ఉన్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.

సినిమాకు ప్లస్ :

ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్
పాటల జంట/సంగీతం
ప్రభాస్ నటన

మైనస్ :

ప్రభాస్ ఇమేజ్‌కి స్టోరీ సరిపోలేదు
కామెడీ వర్కవుట్ కాలేదు
లీడ్ పెయిర్ కెమిస్ట్రీ

రేటింగ్ : 2.75/5

Read more RELATED
Recommended to you

Latest news