హీరోయిన్లంతా అలాంటి బ్యాచే అంటూ బాంబు పేల్చిన రాధిక ఆప్టే..!!

-

తెలుగు చిత్ర పరిశ్రమలోకి రక్తచరిత్ర సినిమా ద్వారా రాధిక ఎంట్రీ ఇచ్చి అక్కడితోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత బాలకృష్ణ సరసన లెజెండ్ , లయన్ చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న ఈ భామ. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమాలో కూడా నటించి మెప్పించింది. దానికి రాధిక ఆప్టే పేరు సినిమాలలో కంటే వివాదాస్పద నటిగా బాగా పేరు పొందింది. ఇకపోతే వివాదాస్పదంగా తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ సినిమా ద్వారా మరింత పాపులారిటీ ను సొంతం చేసుకుంది రాధిక ఆప్టే. తెలుగులో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న రాధిక ఆప్టే బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడ పలు సినిమాలలో నటిస్తూనే.. ఇక ఇలా మరొకవైపు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాధిక ఆప్టే.. ఇంటర్వ్యూ లో భాగంగానే హీరోయిన్ లకు సంబంధించి ఒక వార్త చెప్పి ఆటం బాంబు పేల్చి అందరికీ షాక్ ఇచ్చింది . అంతేకాదు ప్రతి ఒక్క హీరోయిన్ కూడా సర్జరీ బ్యాచే అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తోటి కథానాయకుల సర్జరీ ముఖాలు చూసి అలసిపోయాను అని తెలుపుతూనే తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు కూడా ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించింది. ఇకపోతే ప్రేక్షకులను మెప్పించ డానికి చాలా మంది హీరోయిన్లు ముఖానికి మాత్రానికే కాదు శరీర భాగాలలో కూడా సర్జరీ చేయించు కుంటున్నారు అంటూ.. ఇక అలాంటి వారిని చూసి పూర్తిగా నీరసించి పోయాయని రాధిక ఆప్టే తెలిపింది.

ఇకపోతే చాలా మంది హీరోయిన్లు వయసుతో పోటీపడలేక శరీరంతో పోటీ పడుతున్నట్లు ఆమె తెలిపింది. శరీరంలో వివిధ భాగాలకు సర్జరీ చేయించుకోవడం చూడలేకపోతున్నాను అంటూ రాధిక ఆప్టే తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news