బిగ్‌బాస్ సీజన్-7 రోజురోజుకు ఇంట్రెస్టింగ్గా మారుతోంది. గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్న కొద్దీ ఆటలో ఇంటెన్సిటీ పెరుగుతోంది. గత వార ఎలిమినేషన్ లేదని చెప్పిన హోస్ట్ నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్టే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అయితే ఈ సీజన్ మొదటి నుంచి ఫిమేల్ కంటెస్టెంట్లనే బయటకు పంపిస్తున్న బిగ్ బాస్ మధ్యలో సందీప్ మాస్టర్, బోలే శావలితో కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు.
అంతా అనుకున్నట్లే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అశ్విని, రతిక ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అశ్విని మొదటి నుంచి అంత యాక్టివ్‌గా లేకపోవడం.. హౌస్ మేట్స్‌తో అంతగా కలిసిపోకవడం మైనస్‌గా మారాయి. కానీ కొంతవరకు తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించింది. మరోవైపు కొన్ని వారాల కిందట ఎలిమినేట్ అయిన రతిక, మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే, రెండోసారి మాత్రం తన ఆట తీరును ఏ మాత్రం మెరుగుపరుచుకోలేకపోవడంతో తాజాగా ఎలిమినేట్ అయింది.