బిగ్​బాస్ రతికపై మాజీ లవర్ రాహుల్ షాకింగ్ పోస్టు.. బండారమంతా బయపెట్టేశాడుగా

-

బిగ్​బాస్ తెలుగు సీజన్-7 ప్రస్తుతం ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ రెండువారాల్లో బాగా ఎలివేట్ అయిన కంటెస్టెంట్లలో మొదటి స్థానంలో ఉంటుంది రతికా రోజ్. ఈ భామ బిగ్​బాస్ మాజీ విన్నర్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ లవర్ అని షోలోకి వచ్చిన తర్వాత తెలిసింది. షో ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత ఈ ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.

బిగ్ బాస్ హౌస్‌లో రతికా రోజ్ సేఫ్ గేమ్ ఆడుతూ.. తరచుగా తన మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రస్తావిస్తోంది. దీంతో ఈ షోలో ఆమెపై సింపతీతో పాటు బయట రాహుల్​పై నెగిటివిటీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ సిప్లిగంజ్ నెట్టింట పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్టు ఇండైరెక్ట్​గా రతికను ఉద్దేశిస్తూ పెట్టిందనే అర్థమవుతోందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ రాహుల్ సిప్లి గంజ్ పోస్ట్​లో ఏం పెట్టాడంటే..?

” ఫేక్ సింపతి గేమ్స్ ఎప్పటివరకు? జనాలు ఎప్పుడూ తమ సొంత ప్రతిభను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తారు. కానీ, కొంతమంది మాత్రం ఎప్పుడు ఇతరుల ప్రతిభ, పేరుపై ఆధారపడుతుంటారు. అదే విషయాన్ని కొంతమంది నిరూపిస్తారు. ఫేమ్ కోసం నేమ్​ అవసరాని కన్నా ఎక్కువగా వాడుకుంటున్నారు.నీ లోపల ఉన్న మనిషికి ఆల్ ది బెస్ట్. అలాగే పైసలు తీసుకున్న వాళ్ల టీమ్​కు(పీఆర్​) కూడా కంగ్రాట్స్. మరో పోస్ట్​లో.. నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఆరేళ్ల తర్వాత ఒకరి ఫోన్‌లో ఉన్న పర్సనల్ ఫొటోలు ఒక్కసారిగా బయటకు ఎలా వచ్చాయి?ఇంటర్నెట్‌లో ఎలా చక్కర్లు కొడుతున్నాయి? ఇది వాళ్లు లోపలికి వెళ్లే ముందే ప్రీ ప్లాన్‌గా చేసిన పనేనా?”

“గాయ్స్ దీనికి మీరంతా సమాధానం కనుక్కుని అసలు నిజాలు ఏంటో తెలుసుకోవాలి. నాకూ, మరొకరి జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. అది అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.ఎందుకంటే ప్రతిఒక్కరూ తమ ఓన్ సక్సెస్​ కోసం హార్డ్ వర్క్​ చేస్తుంటారు. కానీ చేసే ముందు.. ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్​ ఉంటారు. వాళ్లపై ఇలాంటి తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని గ్రహించాలి’ అంటూ చెప్పాడు.ప్రతి ఒక్కరి జీవితంలో గతం ఉంటుంది. అలాగే, ప్రజెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి అవగాహన లేకుండా జడ్జ్ చేయకండి.నా బాధను ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్లకు థ్యాంక్స్. అలాగే నెగిటివిటీని ప్రచారం చేయాలని చూస్తున్నారో వాళ్లకు కూడా ఆల్ ది బెస్ట్” అని రాసుకొచ్చాడు. ఈ పోస్టు చూసి కచ్చితంగా రతికను ఉద్దేశించే చేశాడని నెటిజన్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version