Raja Vikramarka Movie Review : కార్తికేయ ‘రాజా విక్రమార్క’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

-

Raja Vikramarka Movie Review : `ఆర్‌ ఎక్స్ 100` చిత్రంతో ఓవర్‌నైట్‌లో స్టార్ అయ్యాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ సినిమాతో మంచి ఇమేజ్ పొందాడు. ఆ సినిమా త‌ర్వ‌త విడుద‌లైన కార్తికేయ సినిమాలు విమర్శలకు మెప్పించినా కమర్షియల్‌గా సత్తాచాటలేకపోయాయి. ఇప్పటి వ‌ర‌కూ ఎలాంటి స‌రైనా స‌క్సెస్ లేక‌పోవ‌డంతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని కసితో `రాజా విక్రమార్క` చిత్రంలో నటించాడు హీరో కార్తికేయ‌. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ సరిపల్లి  ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా (నవంబర్‌ 12న) శుక్రవారం విడుదలైంది. ప్రోమోలు చూస్తే కార్తికేయ ఆశల్ని నిలబెట్టే సినిమాలానే ఉంది. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి. ఇందులో సుధాకర్‌ కోమాకుల, సాయికుమార్‌ కీలక పాత్ర‌ల్లో న‌టించ‌గా.. తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా న‌టించింది.

కథ: విక్రమ్ (కార్తికేయ) నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ) లో ఆఫీసర్. విక్ర‌మ్ టీం కు హెడ్ తనికెళ్ల భరణి. హీరో త‌న టీంతో కలిసి ఒక సీక్రెట్ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఆప‌రేష‌న్లో ఓ టెర్ర‌రిస్ట్ ను ప‌ట్టుకుంటారు. కానీ అనుకోకుండా అత‌డు హీరో చేతిలో చ‌నిపోతాడు. చనిపోయిన టెర్ర‌రిస్ట్ దగ్గ‌ర మాజీ నక్సలైట్ గురునారాయణ (పశుపతి) ఆయుధాలు కొన్నాడని.. అతను హోం మంత్రి చక్రవర్తి (సాయికుమార్)పై ఉన్న పాత పగతో తనను టార్గెట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. దీంతో సాయికుమార్ ను కాపాడే బాధ్య‌త విక్ర‌మ్ తీసుకున్నారు. ఈ క్ర‌మంలో హోంమంత్రిని రక్షించడానికి సీక్రెట్ మిష‌న్ ను ఏర్పాటు చేస్తారు. ఈ మిష‌న్ టీం హెడ్ గా హీరో కార్తికేయ వ్య‌వ‌హ‌రిస్తారు.

కట్‌ చేస్తే .. సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా హీరోయిన్‌ తాన్య రవిచంద్రన్ కు డాన్స్ నేర్పించే మాస్టర్‌కి అసిస్టెంట్‌గా కార్తికేయ హోంమంత్రి ఇంటికి వెళ్తారు. ఈ క్ర‌మంలో ఈ క్ర‌మంలో హోం మినిష్ట‌ర్ కూతురుతో ప్రేమ‌లో ప‌డుతాడు విక్ర‌మ్. ఈ క్ర‌మంలో మాజీ న‌క్స‌లైట్ గురునారాయణ హోం మంత్రి అటాక్ చేస్తాడు. ఆ ప్ర‌య‌త్నాన్ని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొడుతారు హీరో అండ్ టీం. కానీ గురునారాయణ ప్లాన్ .. హోం మినిష్ట‌ర్ ని చంపడం కాదని, ఇంకేదో ఉందని విక్రమ్ కు అర్థమవుతుంది.
ఇంతకీ ఆ ప్లానేంటీ? వారి ప్లాన్ ను ఏ విధంగా.. హీరో ఎలా భగ్నం చేశాడా? లేదా.. ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి? అనేదే సినిమా..

 

కథనం-విశ్లేషణ: రాజకీయ నాయకుడికి ప్రాణాపాయంలో ఉంటే.. హీరో త‌న ప్రాణాలు అడ్డువేసి కాపాడుతాడు. ఈ త‌ర‌హా క‌థ‌లు గ‌తంలో ఎన్నో వ‌చ్చాయి. కానీ, క‌థ పాత‌దే అయినా.. డైరెక్ట‌ర్ శ్రీ సిరిపల్లి
కాస్తా కామెడీ మిక్స్ చేసి.. ఆసక్తికరంగా చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫస్టాఫ్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి టైమింగ్ లో కామెడీ సీన్లతో పెట్టింది పుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ చేశాడు.

ఫస్టాఫ్ మొత్తం కామెడీ విత్ యాక్షన్ గా తెరకెక్కించాడు. కానీ ఇంటర్వెల్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చి..క‌థ వేగాన్ని కాస్తా స్లో చేశాడు డైరెక్ట‌ర్. అప్పటివరకు వేగంగా సాగిన స్క్రీన్ ప్లే కాస్త మందకొడిగా ముందుకు వెళ్ళింది. ఈ క్ర‌మంలో హీరోయిన్ కి సీక్రెట్ ఆప‌రేష‌న్ గురించి తెలిసిపోయింది. హీరో మీద అల‌గ‌డం.. ఆ త‌రువాత కూల్ అవుతుంది. కానీ, హీరోను ఎన్ఐఏ ఆఫీస‌ర్ అని.. న‌మ్మ‌లేక‌పోతుంది. నానా ర‌కాలుగా న‌మ్మించేలా ప్రయ‌త్నాలు చేస్తాడు హీరో. ఈ క్ర‌మంలో హీరో అండ్ కో చేసే గల్లీ విన్యాసాలు చూస్తే.. చాలా ఫ‌న్నీగా ఉన్నాయి. దాదాపుగా ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల పరిస్థితి కూడా హీరోయిన్ తరహాలోనే ఉంటుంది.

ఇక సెకండ్ హాఫ్.. కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్ళడానికి డైరెక్ట‌ర్ ప్ర‌య‌త్నించారు. కానీ కీలకమైన రెండో అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలు బాగా నెమ్మదించడంతో సినిమా స్పీడ్ కు బ్రేకులు పడతాయి. హీరోయిన్ కిడ్నాప్ చుట్టూ కొన్ని స‌న్నీవేశాలు న‌డిచాయి. కానీ.. అవి డ్రామా తలా తోకా లేకుండా సోర్టీ సాగింది. ఈ క్ర‌మంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ చేసిన సెక్యూరిటీ అధికారి పాత్రలో విలన్ షేడ్స్ చూపించి థ్రిల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, కాస్తా కామెడీ మిక్స్ చేసి.. ఆ పాత్రలో ఏమాత్రం ఇంటెన్సిటీ లేకపోవడం.. దాన్ని పేలవంగా తీర్చిదిద్దడంతో సెంక‌డాఫ్ అంత ఇంట్రెస్టింగ్ లేక‌పోయింది. అలాగే.. క్లైమాక్స్ కు ముందే విలన్ ఎవరో తెలుసిపోవడంప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూడా అంతంత మాత్రమే అనిపించింది. ఫస్టాఫ్ అంతా కాస్తా కామెడీతో ఎంట‌ర్ టైన్ చేసినా.. సెకండాఫ్ లో సోర్టీ లైన్ స్లోగా సాగ‌డంతో అంతా ఇంట్రెస్టింగ్ గా లేదు. ఓవరాల్ గా రాజా విక్రమార్క యావరేజ్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది.

నటీనటులు: కార్తికేయ కేరీర్ విష‌యంలో ఈ సినిమాలో ఓ మైలురాయిగా నిలుస్తుంది. పాత్ర‌కు త‌గ్గ బాడీ లాంగ్వేజ్ లో మెప్పించడ‌నే చెప్పాలి. త‌న‌లో కామెడీ యాంగిల్ కూడా ఉన్న‌ట్టు విక్రమ్ క్యారెక్టర్ ద్వారా తెలిపారు. ఇక‌ హీరోయిన్ తాన్య చూడ్డానికి పర్వాలేదు. త‌న పాత్రకు అంతా స్కోప్ లేద‌నే చెప్పాలి. తాన్య అందాన్ని ఎలివేట్ చేసే పాటలేవీ కూడా ఇందులో లేవు. హీరో బాస్ గా తనికెళ్ల భరణి కీ రోల్ చేశారు. దాదాపు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఆయన న‌ట‌న, డైలాగ్స్ తో అదుర్స్ అనిపించారు. యాంగ్రీ యంగ్ మాన్
సాయికుమార్ కు స‌రైన పాత్ర ద‌క్క‌లేద‌నే చెప్పాలి. ఆయ‌నకు త‌గిన‌ పాత్ర దగ్గ‌లేద‌ని చెప్పాలి.
ఇక విలన్ పాత్ర‌లో ప‌శుప‌తి కనిపించారు. కానీ, తమిళంలో ఎన్నో ఇంటెన్స్ రోల్స్ చేసిన పశుపతిని ఇందులో విలన్ పాత్రకు ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. ఆయ‌న టాలెంట్ కు త‌గిన పాత్ర కాద‌నే చెప్పాలి. ఇక‌ సుధాకర్ కోమాకుల పోలీసు పాత్ర‌లో క‌నిపించి మెప్పించారు. కామెడీ టైమింగ్ కూడా బాగుంద‌నే చెప్పాలి. హర్షవర్ధన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సినిమాలో బెస్ట్ ఎంటర్టైనర్ అంటే అతనే.

సాంకేతిక వర్గం: ప్రశాంత్ ఆర్ విహారి అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పి.సి.మౌళి కెమెరా పనితనం బాగుంది. కొత్త నిర్మాతలైనా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడలేదు. బాగానే ఖర్చు పెట్టారు. తెరమీద క్వాలిటీ కనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ విష‌యానికి వ‌స్తే..
ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ కాస్త వీక్ కానే క‌నిపించాయి. చాలా స‌న్నీవేశాలు బోర్ కొట్టించేలా ఉన్నాయి. కానీ ఎడిటింగ్ ఓకే . సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలోమాటలు అద్బుతం. ఐతే.. దర్శకుడు శ్రీ సిరిపల్లి ద‌ర్శ‌క‌త్వం చేస్తున్న తొలి చిత్రం కావడంతో కావాల్సిన‌న్నీ వ‌న‌రులున్నా.. స‌రిగా వినియోగించుకోలేక‌పోయాడ‌నే చెప్పాలి. తెలిసిన కథనే రాసుకున్నా.. స్క్రీన్ ప్లే బాగా అల్లుకున్నాడు. అక్కడ గురు వివి వినాయక్ మార్క్ స్పష్టంగా కనిపించింది.

చివరగా: డైరక్ట‌ర్ శ్రీ సిరిపల్లి చేతిలో రాజా విక్రమార్క.. అనే గ‌న్ మిస్ ఫైర్ అయ్యింద‌ని చెప్పాలి

రేటింగ్-2/5

Read more RELATED
Recommended to you

Latest news