అది ఒక దెయ్యాల రెల్వేస్టేషన్ అట.. 42ఏళ్లపాటు మూతపడింది..ఇప్పుడు ఓపెన్ చేశారు కానీ..

-

దెయ్యాలంటే అందరికి భయం ఉంటుంది కానీ, వాటి గురించి డిస్కస్ చేయటం అంటే మాత్రం భలే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది కదూ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కూడా అలాంటిదే. 42 ఏళ్లు పాటు ఆ రైల్వేస్టేషన్ లో ఒక్క రైలూ ఆగలేదు.అటుగుండా పోవాల్సిన రైళ్లైతే ఆ స్టేషన్ రాగనే స్పీడ్ పెంచేస్తాయట. అసలు ఆ స్టేషన్ లో ఏం జరిగింది. దెయ్యాల రైల్వేస్టేషన్ గా ఎందుకు పేరొచ్చిందో చూద్దాం.

ఇది పశ్చిమబెంగాల్‌లోని పురూలియాలో బెగన్‌కొడార్ రైల్వేస్టేషన్ అని ఉంది. ఇండియాలోని 10 దెయ్యాల రైల్వేస్టేషన్లలో ఇదీ ఒకటిగా అంటుంటారు. దీన్ని 1967లో ఈ లిస్టులో చేర్చినట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే..

ఓ రోజు స్టేషన్ మాస్టర్ అనుకోకుండా, అకస్మాత్తుగా చనిపోయాడు. అందుకు కారణం ఆయన ఓ దెయ్యాన్ని చూశాడని ప్రచారం నడిచింది. రిపోర్టుల ప్రకారం తెలిసిందేంటే.. స్టేషన్ మాస్టర్ ఓ మహిళను చూశాడట. తెల్లశారీ కట్టుకున్న ఆమె చీకట్లో రైలు పట్టాలపై నడుస్తూ కనిపించిందట. దాంతో బాగా భయపడిన ఆయన చనిపోయాడని తెలిసింది.

42 ఏళ్లపాటూ ఆగని రైళ్లు:

ఈ స్టేషన్‌లో జరిగిన ఘటనతో ప్రయాణికులు, సాధారణ ప్రజలు ఈ స్టేషన్‌కి రావడం మానేశారట. దాంతో 42 ఏళ్ల పాటూ ఈ స్టేషన్‌లో ఒక్క రైలూ ఆగలేదు. రోజూ రైళ్లు ఈ స్టేషన్ వైపుగా రాకపోకలు సాగించేయి. చాలా రైళ్లు ఈ స్టేషన్ దగ్గరకు రాగానే వాటి వేగాన్ని బాగా పెంచేవారు. ఐతే… 2009లో మమతా బెనర్జీ రైల్వే మంత్రి అయ్యాక ఆమె ఈ స్టేషన్‌ని మళ్లీ తెరిపించారు. కానీ సాయంత్రం 5 వరకే. ఆ తర్వాత ప్రయాణికులు గానీ, రైల్వే సిబ్బంది గానీ ఎవరూ ఇక్కడ ఉండరుట. ఎన్ని పనులున్నా… అన్నీ ఆపేసి వెళ్లిపోతారు. అధికారులు కూడా ఎవర్నీ బలవంతంగా ఉండమని చెప్పింది లేదు.

దెయ్యాలు ఉన్నాయని ఏ ప్రభుత్వాలూ ఒప్పుకోవు. మరి అలాంటప్పుడు స్టేషన్ రోజంతా తెరవాలి కదా.. కానీ స్వయంగా ప్రయాణికులే రావడం మానేస్తుండటంతో సాయంత్రం తర్వాత ఈ స్టేషన్ ఒంటరిగా నిజంగానే దెయ్యంకళతో ఉన్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా రైలు పట్టాలపై దెయ్యాలు ఉంటాయని చాలామంది చెబుతుంటారు. ఈ స్టేషన్ కు సంబంధించి బయటపడనివి ఇంకా ఏవో జరిగి ఉండాలి..లేదంటే ఇంతలా అక్కడి జనాలు, అధికారులు భయపడరు.

Read more RELATED
Recommended to you

Latest news