మహేష్ మూవీ కోసం భారీ స్కెచ్ వేసిన రాజమౌళి..!

-

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే ఆయన ద్వారా వచ్చిన మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. అంతేకాదు ఈ సినిమా చేసి మరొకసారి తెలుగోడి సత్తాను ఎల్లలు దాటించారు. ఇక ఇదే సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఇకపోతే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని.. అడ్వెంచర్ డ్రామా గా తీయబోతున్నట్లు ఇప్పటికే క్లియర్ గా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే . ఇక ఈ భారీ పాన్ ఇండియా సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకి కూడా రానున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమా అవుట్ పుట్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంత లేట్ అయినా పర్వాలేదు కానీ అనుకున్న సమయానికి ఔట్పుట్ వచ్చేదాకా రాజమౌళి అసలు వదిలిపెట్టరన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నటీనటులతో కూడా తనకు కావలసిన విధంగా వారిని విసిగించైనా ఫైనల్ ప్రింట్ తీసుకుంటారు అంటూ ఇటీవల ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా వెల్లడించారు. అలాంటి రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా కోసం ఒక మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఏకంగా ముగ్గురు బాలీవుడ్ నటులను రంగంలోకి దించబోతున్నారట. అందుకు తగ్గట్టుగానే నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకువచ్చే అవకాశం ఉందని.. వాళ్లను కూడా సెలెక్ట్ చేయడంలో రాజమౌళి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా షూటింగుకు ముందే ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ నెలకొనడంతో ప్రస్తుతం సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న కాబట్టి ఈ సినిమా షూటింగ్ ఆ రోజు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news