తెలంగాణ బీజేపీలో అలజడి తగ్గడం లేదు..బిజేపి అధ్యక్షుడు మార్పుకు ముందు నేతల మధ్య నడిచిన పోరు..ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. చాలామంది బండి సంజయ్ నాయకత్వానికి యాంటీగా గళం విప్పిన విషయం తెలిసిందే. చివరికి ఆయన్ని తప్పించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా పెట్టారు. అయినా సరే పార్టీలో పోరు నడుస్తూనే ఉంది. అదే సమయంలో పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోవడంతో..నేతలు వేరే పార్టీలోకి జంప్ అవ్వడానికి చూస్తున్నారు.
ఇప్పటికే కొందరు కీలక నేతలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మొన్నటివరకు బిఆర్‌ఎస్ పార్టీకి బిజేపినా ప్రత్యామ్నాయం అన్నట్లు కనిపించింది. అప్పుడు బిజేపిలోకి పెద్ద వలసలు నడిచాయి. ఇప్పుడు బిజేపి గ్రాఫ్ డౌన్ అయింది. దీంతో కాంగ్రెస్ లోకి వలసలు నడుస్తున్నాయి. కొందరు కీలక నేతలు కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి వచ్చిన సరే..ఆయన బిజేపిలో యాక్టివ్ గా లేరు..ఆయన కాంగ్రెస్ లోకి జంప్ చేసే ఛాన్స్ ఉంది.
ఇటు చంద్రశేఖర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, రవీంద్ర నాయక్ లాంటి వారు బిజేపిని వదలడానికి రెడీగా ఉన్నారని తెలిసింది. అయితే ఈటల రాజేందర్ ఎవరు బిజేపిని వదిలి వెళ్లకుండా బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఈటల ఎన్ని ప్రయత్నాలు చేసిన జంప్ అయ్యేవారు ఆగేలా లేరు. ఎలాగో బిజేపిలో ఉంటే గెలుపు అసాధ్యం..అందుకే వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో బిజేపి నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఎక్కువగానే నడిచేలా ఉన్నాయి.