రాజమౌళి సినిమా డిసెంబర్ లో స్టార్ట్

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేసే సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి మెగా మల్టీస్టారర్ షురూ చేయబోతున్నాడు జక్కన్న. చరణ్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో మెగా మూవీ ప్లాన్ చేసిన రాజమౌళి అసలైతే నవంబర్ నుండి సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాల్సి ఉంది. అయితే ఎన్.టి.ఆర్ అరవింద సమేత షూటింగ్ టైంలోనే హరికృష్ణ మరణించడం తెలిసిందే. సినిమా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఐదోరోజు నుండి సెట్స్ కు వెళ్లాడు ఎన్.టి.ఆర్.

అరవింద సమేత అనుకున్న విధంగా పూర్తయింది. అయితే ఇప్పుడు ఓ నెల పాటు ఫ్యామిలీతో ఉండాలని అనుకుంటున్నాడు. ఈలోగానే ఎన్.టి.ఆర్ రాజమౌళి సినిమాకు కొంత గ్యాప్ అడిగాడని 2019 లోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటూ వార్తలు రాశారు. కాని ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది. ఈరోజు అరవింద సమేత ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో రాజమౌళి సినిమా డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్తుందని అన్నాడు ఎన్టీఆర్.

ముందు తానే షూటింగ్ లో పాల్గొంటానని చెప్పిన ఎన్.టి.ఆర్ ఆ తర్వాత చరణ్ జాయిన్ అవుతాడని అంటున్నాడు. సో ట్రిపుల్ ఆర్ పై వచ్చిన వార్తలన్ని రూమర్స్ అన్నమాట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version