నాని జెర్సీపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!

-

నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజై సూపర్ హిట్ అందుకుంది. నాని మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే సినిమా చూసిన ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ సినిమాపై ప్రశంసలు అందించారు.

ఇక ఇప్పుడు రాజమౌళి వంతు వచ్చింది. జెర్సీ సినిమా చూసిన రాజమౌళి సర్ ప్రైజ్ కామెంట్స్ చేశాడు. సినిమా చూసిన రాజమౌళి హృదయాన్ని తాకేలా ఉంది.. అద్భుతంగా రాసి, నైపుణ్యంతో గౌతం తిన్ననూరి ప్రతిభకు వెల్ డన్. ఈ సినిమాలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరు గర్వించేలా ఉంది ఈ సినిమా. నాని బాబు జస్ట్ లవ్ యు అంతే.. అంటూ నాని జెర్సీపై రాజమౌళి కామెంట్స్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version