వారు లేకపోతే రాజమౌళికి సక్సెస్ లేదు – నిర్మాత సి.కళ్యాణ్

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాజమౌళికి దర్శకుడిగా ఎంత ఉన్నత స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎల్లలు దాటించి ఆస్కార్ అవార్డును కూడా సాధించిన ఘనత ఈయనకే సాధ్యమని చెప్పాలి. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతోమంది దర్శకులు రాజమౌళి రోల్ మోడల్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ సక్సెస్ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చెయ్యనున్నారు.ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉండగా ఇలాంటి సమయంలో రాజమౌళి గురించి ప్రముఖ సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

నిర్మాత మాట్లాడుతూ.. సినిమాల పట్ల ప్రేక్షకులకు ఉన్నటువంటి అభిరుచి ఎప్పటికప్పుడు మారిపోతోంది. ప్రేక్షకుల అభిరుచిని, వారి నాడిని పట్టుకుంటే ఏ డైరెక్టర్ అయినా సరే సక్సెస్ అవుతారు. కానీ ఇలా చేయడం ఏ డైరెక్టర్ కి చేతకాదు.. ఆఖరికి రాజమౌళి వల్ల కూడా కాదు.. రాజమౌళి ఇప్పటివరకు ఒక ఫ్లాప్ కూడా లేకుండా కొనసాగుతున్నారు. కానీ ఇలా హిట్స్ అందుకోవడానికి కారణం స్టార్ హీరోలే అంటూ సంచలన కామెంట్లు చేశారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సినిమా చేస్తారు అందులోనూ స్టార్ హీరోలతో మాత్రమే సినిమా చేస్తారు.

దాదాపు 5 సంవత్సరాల వరకు స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.. ఇక ఆ హీరోల సినిమాలు విడుదలైన తర్వాత ఎలా ఉన్నా సరే మొదట్లో భారీగా సినిమాపై హైప్ పెరుగుతుంది. అలా ఆయనకు సక్సెస్ లభిస్తోంది..అలా కాకుండా ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు చేస్తూ, కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పుడే హిట్ ఫ్లాప్ అనేది కచ్చితంగా తెలుస్తుంది. కొత్త వాళ్లతో సినిమాలు చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించినప్పుడే దర్శకుల యొక్క అసలైన ప్రతిభ బయటపడుతుంది అంటూ రాజమౌళి గురించి కళ్యాణ్ కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news