4 గంటల రన్​ టైమ్​తో ఓటీటీలోకి బేబీ మూవీ..?

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ సినిమా మేనియానే. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాపై మీమ్స్ మామూలుగా లేవు. అటు మౌత్ టాక్.. ఇటు కలెక్షన్లతో బేబీకి మంచి హిట్ దక్కింది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..?

బేబీ సినిమాపై మరో బజ్ క్రియేట్ అయ్యింది. సుమారు 3 గంటల నిడివి కలిగిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం 4 గంటల రన్​టైమ్​తో రానుందట. అయితే తాజాగా మరో పాట సహా.. కొన్ని సన్నివేశాలను సినిమాలో చేర్చనున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య,నటుడు విరాజ్​ మధ్య ఎక్కువ సీన్స్​ ఉండనున్నట్లు తెలుస్తోంది. హీరో ఆనంద్ దేవరకొండకు సంబంధించి కొన్ని ఎమోషనల్​ సన్నివేశాలు కూడా ఉంటాయట. అయితే ఇవన్నీ సాధ్యమైతే ఓటీటీలోకి ‘బేబీ’ నాలుగు గంటల రన్​టైమ్​తో సందడి చేయనుందట. అయితే ఇది ఏ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో వస్తుంది.. ఎప్పుడు వస్తుందో మాత్రం ఇంకా చిత్రబృందం ప్రకటించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news