రైతు బీమా దరఖాస్తులను వెంటనే అప్‌లోడ్‌ చేయండి: నిరంజన్‌ రెడ్డి

-

రైతు భీమాకు గడువు ముగుస్తున్నందున కొత్తగా వచ్చిన ధరఖాస్తులను వెంటనే అప్‌ లోడ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి జిల్లాల అధికారులతో మంత్రి.. దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రీయ ఎరువులు, పచ్చి రొట్ట వాడకంపై రైతులను మరింత ప్రోత్సహించాలని సూచించారు. నేల ఆరోగ్యం దృష్ట్యా అన్నదాతల్లో చైతన్యం తేవాలని పేర్కొన్నారు.

వ్యవసాయ పంటల సాగు వివరాలు వెంటనే తెలియజేయాలని అధికారులను మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆదేశించారు. వరి సహా కందిని నెలాఖరు వరకు.. సెప్టెంబర్‌ మొదటి వారం వరకు మిరప సాగు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ వానాకాలం సీజన్‌కు సరిపడా రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 83 లక్షల ఎకరాలలో పంటలు సాగయ్యాయని వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు వెంటనే ఆయిల్‌ పామ్ మొక్కలు నాటించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news