రాజశేఖర్ ‘కల్కి’ టీజర్.. యాంగ్రీ స్టార్ ఆగయా..!

-

పిఎస్వి గరుడవేగ తర్వాత రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. అ! సినిమాతో ప్రతిభ చాటిన ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ సరసన అదా శర్మ, నందిత శ్వేతలు నటిస్తున్నారు. ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా కల్కి టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో కేవలం రాజశేఖర్ ఎంట్రీ సీన్ ఒక్కటి చూపించారు. వర్షంలో గొడుగుతో కనిపించిన రాజశేఖర్ మళ్లీ మునుపటి ఫాంలో వచ్చేలా కనిపిస్తున్నాడు.

పిరియాడికల్ మూవీగా వస్తున్న కల్కి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గరుడవేగ సినిమాతో సత్తా చాటిన రాజశేఖర్ ఈసారి కల్కితో కూడా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ కథ, కథనాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటున్నారు. సి.కళ్యాణ్, జీవిత రాజశేఖర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news