సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఆయన అగ్ర కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. కథానాయకుడు మహేశ్‌బాబు ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు. రజనీ తన స్టైల్‌తో మరోసారి అభిమానులను ఫిదా చేశారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్ నిర్మిస్తున్నారు. సునీల్ శెట్టి, నివేదా థామస్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత రజనీకాంత్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు.