రజినీకాంత్ ‘దర్బార్’ నయా సెన్సేషనల్ రికార్డ్

-

 

టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు కొట్టేసే సత్తా తమిళనాడులో రజనీకి ఉన్నట్లు మరే ఇండస్ట్రీలో ఏ హీరోకి లేదు అన్నది వాస్తవం. అయితే ఈ మధ్య హీరో విజయ్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అతని సినిమా విడుదలైంది అంటే చాలు తమిళనాడులోని ప్రజలంతా థియేటర్ల ముందు వాలిపోతున్నారు. వరుస హిట్ చిత్రాలతో విజయ్ ఫ్యాన్ బేస్ కూడా బాగానే పెరిగింది. అయితే మురుగదాస్ దర్శకత్వంలో రజనీ హీరోగా విడుదలైన ‘దర్బార్’ సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డు కొట్టుకుపోతుంది.

 

ఇప్పుడు తమిళనాడులో మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా విజయ్ నటించిన బిగిల్ మొదటి స్థానంలో ఉంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిరోజు తమిళనాట 25 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే సూపర్ స్టార్ రజిని దర్బార్ సినిమాతో తమిళనాడులో హిట్ టాక్ సంపాదించడంతో పాటు భారీ ప్రీ బుకింగ్ మరియు పోటీలో లో ఏ సినిమాలు లేనందువల్ల విజయ్ మొదటిరోజు రికార్డును కొట్టబోతున్నాడట.

దర్బార్ చిత్రానికి రజినీ అనే పేరు ఒకటి చాలదన్నట్లు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ పైన ఉన్న అంచనాలు మరియు చాలా రోజుల తర్వాత ఒక పోలీస్ రోల్ కనపడ్డ తలైవ ఇంక లేడి సూపర్ స్టార్ నయనతార అంతా కలిసి విజయ్ రికార్డులను తుడిచిపెట్టబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news