తలైవా ఆన్ గ్రాండ్ ఫాదర్ డ్యూటీ.. మనవడిని స్వయంగా స్కూల్‌కు తీసుకెళ్లిన రజినీకాంత్

-

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నిత్యం సినిమాలతో బిజీగా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఫ్యామిలీకి కూడా టైం ఇస్తారు. కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా హీరో నుంచి గ్రాండ్ ఫాదర్ డ్యూటీకి మారారు. స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న తన మనవడిని స్వయంగా తీసుకెళ్లి పాఠశాలలో డ్రాప్ చేశారు. ఈ విషయాన్ని రజినీ కుమార్తె సౌందర్య ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.

ఇవాళ ఉదయం తన కుమారుడు వేద్‌ పాఠశాలకు వెళ్లనని మారాం చేస్తే రజినీకాంత్ స్వయంగా వేద్‌ని పాఠశాలకు తీసుకెళ్లినట్లు సౌందర్య ఆ పోస్టులో పేర్కొన్నారు.  ‘ఆఫ్‌ స్క్రీన్‌లో అయినా ఆన్‌ స్క్రీన్‌లో అయినా ప్రతి పాత్రనూ మీరు ఉత్తమంగా పోషిస్తారు నాన్నా..’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు తన కుమారుడిని పాఠశాలకు తీసుకెళ్తున్న ఫొటోలను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు తలైవా ఇప్పుడు కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version