చంద్రబాబు పాలన మొత్తం…దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం అంటూ మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఇవాళ ప్రెస్‌మీట్ లో జగన్ మాట్లాడుతూ… 52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా ? తిరోగమనంలో వెళ్తోందా ? ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతోందని తెలిపారు.
ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణిచివేత ధోరణితో ముందుకు వెళ్తోందని నిప్పులు చెరిగారు. బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశ పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శలు చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దారుణమైన పరిస్థితి ఉందని.. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టే ధైర్యం కూడా చంద్రబాబు కి లేదన్నారు.
రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే హామీల అమలుకు సంబంధించి కేటాయింపులు చూపాలని కోరారు. మోసపూరిత హామీలపై నిధులను బడ్జెట్ లో చూపించక పోతే ప్రజలు రోడ్డు పైకి వచ్చి ఆందోళనకు దిగుతారు అని చంద్రబాబుకు తెలుసు అని.. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని చంద్రబాబు ఇలా చేస్తున్నారని నిప్పులు చెరిగారు.