అలాంటి ఘనత సాధించిన తొలి హీరోగా రజనీకాంత్ రికార్డు..!

-

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న ఈయన.. ఈ వయసులో కూడా తన సినిమాలతో రేర్ ఫీట్ అందుకుంటూ అరుదైన రికార్డులను సృష్టిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా అలాంటి ఘనత సాధించిన తొలి హీరోగా రజనీకాంత్ రికార్డు సృష్టించడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం జైలర్.

రిలీజ్ అయ్యి మూడు వారాలు దగ్గరికి వస్తున్నా కూడా ఇంకా కొన్ని చోట్ల జైలర్ సినిమా హవా కొనసాగుతోంది. పైగా జైలర్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఈ సినిమాకు ధీటుగా మరో సినిమా రాలేదని చెప్పాలి. ముఖ్యంగా కొత్త సినిమాలు ఎన్ని వున్నా.. అవన్నీ కూడా తేలిపోయాయి. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ హవా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది.. అసలు విషయంలోకి వెళ్తే .. జైలర్ సినిమా ఏకంగా తాజాగా రూ.600 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది.

ముఖ్యంగా తమిళంలో ఈ మార్క్ అందుకున్న రెండవ సినిమాగా జైలర్ నిలువగా.. తొలి స్థానంలో రోబో 2.0 స్థానం సంపాదించుకుంది. రోబో సీక్వెల్ రోబో 2.0 ఈ రికార్డును పది రోజుల్లో సాధించగా జైలర్ సినిమా 18 రోజుల్లో ఈ రికార్డును సాధించింది. మరొకవైపు పుష్కరకాలం తర్వాత తెలుగులో ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం ఇదే మొదటిసారి. ఒక తెలుగులోనే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది ఈ సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news