సూపర్ స్టార్ రజనీ కాంత్ త్వరలో ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే రిలీజ్ కాకుండానే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. కేజీయఫ్, అవతార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులను తిరగరాసేస్తోంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటని అనుకుంటున్నారా..?
సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘జైలర్’ సినిమా ఓ అరుదైన రికార్డును తన పేరిట రాసుకుందట. బెంగుళూరులో తొలిరోజు 1090కి పైగా షోలు వేయనున్న సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ‘కేజీయఫ్-2’ (1037 షోలు)తో పాటు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (1014 షోలు) పేరిట ఉన్న రికార్డులను రజనీకాంత్ ‘జైలర్’ బ్రేక్ చేసినట్టయింది. దీన్ని బట్టి అక్కడ రజనీ క్రేజ్ ఎంత ఉందో అంటూ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్‌తో సరసన రమ్యకృష్ణ నటించగా..తమన్నా భాటియా, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్, సునీల్, మిర్నా మీనన్, యోగి బాబు లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.