Rakul Preet Singh: బ్యాక్ లెస్ డ్రెస్సులో కాక రేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ భామ తన హెల్త్ పైన ఫుల్ కాన్సంట్రేట్ చేస్తుంది. ఇకపోతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అప్ డేట్స్ తో పాటు లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

సదరు ఫొటోల్లో రకుల్ బ్లాక్ డ్రెస్సులో చాలా అందంగా కనబడుతోంది. బ్యాక్ వీపు అందాలు చూపుతూ తన చూపులతోనే కైపెక్కిస్తోంది. కంప్లీట్ బ్లాక్ డ్రెస్సులో బిగ్ ఇయర్ రింగ్స్ ధరించి అలా చూపులతో అట్రాక్ట్ చేస్తున్న రకుల్..రకరకాల స్టిల్స్ ఇచ్చింది. అలా నిలబడి, ఓరగా చూస్తూ , అటు, ఇటు వైపులకు చూస్తూ పిచ్చెక్కిస్తోంది.

ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ‘లవ్ యూ, కూల్, వెరీ నైస్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తు్న్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ చివరగా ‘కొండ పొలం’ చిత్రంలో కనిపించింది. ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ సుందరి బాలీవుడ్ ఫిల్మ్స్ పైన కాన్సంట్రేట్ చేసింది. ఈమె నటించిన ‘రన్ వే 34’ ఫిల్మ్ ఈ నెల 29న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version