దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ ను కలకలం రేపింది. ఢిల్లీలో ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిలో ఓమిక్రాన్ BA.2.12.1 వేరింయంట్ ను అధికారులు గుర్తించారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదకమని అధికారులుల ప్రకటించారు. ఓమిక్రాన్ BA.2 వేరియంట్ కన్నా.. ఈ కొత్త వేరియంట్ చాలా వేగం గా వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ BA.2.12.1 వేరియంట్ వల్లే ప్రపంచంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు.
అమెరికాలోనే కాకుండా ఢిల్లీలో కూడా ఈ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ వెలుగు చూడకముందు.. ఢిల్లీలో సింగిల్ డిజిట్ లోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యేవి. కానీ ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వందల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ తో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్‌లు, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.