కరోనా నుంచి కోలుకున్న రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా నుండి కోలుకున్నారు. గత నెల 29వ తేదీన కరోనా బారిన పడినట్లు తెలిపిన రామ్ చరణ్, క్వారంటైన్ లో ఉన్నాడు. ప్రస్తుతం పూర్తిస్తాయి ఆరోగ్యంగా ఉన్నానని, రెండుసార్లు కోవిడ్ పరీక్షలు జరుపుకుని, నిర్ధారణకి వచ్చారని తెలిపారు. కరోనా నెగెటివ్ అని రావడంతో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా కోసం రెడీ అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్, కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లో రామ్ చరణ్ పార్ట్ పూర్తి చేస్తారట. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తాయట. వీరిద్దరూ కలిసి ఒకానొక పాటకి స్టెప్పులు వేయన్నున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. అటు ఆచార్య పూర్తికాగానే రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం సిద్ధమవుతాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీని దసరాకి ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట.