భయపెట్టాలంటే 10 నిమిషాలు.. చంపాలంటే పావుగంట.. చరణ్ టీజర్ సౌండ్ లేదంటే..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. అన్నా భయపెట్టాలా.. చంపేయాలా.. భయ పెట్టాలంటే పావుగంట ఏదైనా ఓకే.. సెలెక్ట్ చేస్కో అంటూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఇక రాం కొణిదెల అంటూ రెచ్చిపోతూ చెప్పే డైలాగ్ కూడా మెగా ఫ్యాన్స్ కు నచ్చేసింది. బోయపాటి మార్క్ ఊర మాస్ సినిమాగా వినయ విధేయ రామ వస్తుందని చెప్పొచ్చు.

టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా కంటెంట్ మాస్ అని తెలుస్తుంది. సినిమాలో చరణ్ సోదరులుగా ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ నటిస్తున్నారు. ఇక టీజర్ లో విలన్ గా వివేక్ ఓబేరాయ్ స్టైలిష్ ఎంట్రీ అదిరింది. మొత్తానికి మెగా ఫ్యాన్స్ ఓ ఫుల్ మీల్స్ లాంటి సినిమాగా వినయ విధేయ రామా వస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతి బరిలో దమ్ము చూపించేందుకు వస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news