Ram Charan- Upasana Kamineni: టాలీవుడ్‌లో అన్ అఫ్ ది మోస్ట్ క్యూట్ కపుల్ రామ్‌చరణ్-ఉపాసన. వీరి వివాహం జరిగి.. ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటివరకు పిల్లలను ప్లాన్ చేసుకోలేదు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం.. ఆమెను తరుచు జూనియర్ రామ్ చరణ్, జూనియర్ ఉపాసనో ఎప్పుడు చూపిస్తారు అన్న ప్రశ్నిస్తున్నారు? అయితే ఎప్పుడూ కూడా ఈ ఆంశంపై రామ్ చరణ్ గానీ, ఉపాసన గానీ నోరు విప్పలేదు.
కానీ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఉపాసన మాత్రం ఆ ప్రశ్నకు బదులిస్తూ.. కాస్త సీరియస్ అయింది.
దీని గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు కానీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఉపాసన వెల్లడించింది. ది పూర్తిగా మా పర్సనల్. నాకంటూ కొన్ని హద్దులు గీసుకున్నాను. దీని గురించి ఏం ఆన్సర్ ఇచ్చినా అది సెన్సేషనే అవుతుందని, కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానమివ్వడం నాకు ఇష్టం లేదని పేర్కొంది. ఎవరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇది నా పర్సనల్ లైఫ్. ఆ సమయం వచ్చినప్పుడు గుడ్ న్యూస్ అందరికీ చెబుతాను. కానీ ఇప్పుడు మనం కరోనా కష్టకాలంలో ఉన్నాం. ఒకరికొకరు సాయపడాల్సిన సమయమని తేల్చి చెప్పింది.