రానా కామెంట్స్.. త్రిష ఫోన్ స్విచ్ ఆఫ్..!

-

రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో రానా త్రిషతో డేటింగ్ చేశానని.. రెండు నెలల తర్వాత ఇక ముందుకు సాగడం కష్టమని వెనక్కి తగ్గినట్టి చెప్పుకొచ్చాడు. రానా, త్రిషా కొన్నాళ్లుగా వీరి ప్రేమాయణం గురించి మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అయితే రానాని అడిగితే వు ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడూ తప్పించుకుంటాడు. కాని కరణ్ అంత ఈజీగా వదిలిపెట్టడు కదా అందుకే రానా ఓపెన్ అయ్యాడు.

రెండు నెలలు డేటింగ్ లో ఉన్నామని.. కాని ఆమెతో ఇక కష్టమని తెలిసి తాను డ్రాప్ అయ్యాడని చెప్పాడు రానా. ఇలా చెప్పడం వల్ల వారిద్దరి మధ్య రిలేషన్ మీద వచ్చిన వారలన్ని నిజమే అని డిక్లేర్ అయ్యింది. ఇక ఇదే విషయంపై త్రిష స్పందన తెలుసుకునేందుకు కోలీవుడ్ మీడియా ట్రై చేసిందట. కాని త్రిష ఈ తాకిడి ఎక్కువవడం వల్ల ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుందట. మొత్తానికి మానిపోయిన గాయాన్ని మళ్లీ గిల్లుతున్నట్టుగా ఎప్పుడో జరిగి పోయిన విషయాన్ని తవ్వి త్రిషను ఇబ్బంది పెడుతున్నాడు రాన. ఇప్పుడైతే తప్పించుకున్నా మీడియా ముందుకు వచ్చాక మాత్రం అమ్మడు రానా కామెంట్స్ పై తప్పక సమాధానం చెప్పాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version