ఆయన స్ఫూర్తితోనే…చంద్రబాబు

-

సమసమాజ స్థాపన కోసం పోరాడిన అంబేద్కర్ స్ఫూర్తితోనే తాను సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలో సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై శ్వేత  పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి, పేదరికంపై గెలుపు కార్యక్రమంతో ఆర్థిక అసమానతలను తొలగిస్తూ.. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామన్నారు. పండగలొస్తే అన్ని వర్గాల వారికి కానుకలు ఇస్తున్నామన్నారు చంద్రబాబు. దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రన్నబీమా అమలు చేస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం, డ్వాక్రా సంఘాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు.

రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి ఒక్కో రైతుకు రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ.24 వేల కోట్లు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నెలకు రూ.10వేలు ఆదాయం సంపాదించేలా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలపై నిరంతర నిఘా కోసం గ్రామదర్శిని, గ్రామ వికాసం, జన్మభూమి వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు సీఎం. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని అనేక కార్యక్రమాలను తాము నిర్వహిస్తున్నమని చంద్రబాబు వివరించారు. క్రిస్ మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version