‘ ర‌ణ‌రంగం ‘ వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌… శ‌ర్వా టార్గెట్ ఇదే

యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్‌వ‌ర్మ‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రణరంగం. ఆగస్టు 15 కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ‌వంశీ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాలో పాటలు, టీజ‌ర్లు, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత మూడు నాలుగేళ్లుగా లవర్ బాయ్, ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ వస్తున్న శ‌ర్వానంద్‌ ఈ సినిమా కోసం రూటు మార్చిన‌ట్టు తెలుస్తోంది.

ranarangam movie pre release business details

1990వ దశకంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని తెలుస్తోంది. శర్వానంద్‌కు జోడీగా కాజల్ అగర్వాల్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని నటించడంతో సినిమాకు ట్రేడ్ స‌ర్కిల్స్‌తో పాటు ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.16 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మొత్తం వ‌సూలు చేస్తే ర‌ణ‌రంగం బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చిన‌ట్లవుతుంది.

నైజాం + ఏపీ కలుపుకుని 13 కోట్ల బిజినెస్ చేస్తే… కర్నాటక 90లక్షలు, ఇతర భారతదేశం 30 లక్షలు, ఓవర్సీస్ 1.8 కోట్లుగా రైట్స్ విక్రయించారు. వరల్డ్ వైడ్ ఓవ‌రాల్‌గా రూ.16 కోట్ల బిజినెస్ సాగింది. ప్రింట్లు పబ్లిసిటీ ఖర్చులు కాక సాగిన బిజినెస్ ఇది.

Ranarangam movie pre release business details

ర‌ణ‌రంగం ఏరియా బిజినెస్ (కోట్లలో) 

నైజాం – 5.00

సీడెడ్ – 2.00

నెల్లూరు – 0.50

కృష్ణ – 1.00

గుంటూరు 1.20

వైజాగ్ – 1.50

ఈస్ట్ – 1.00

వెస్ట్ – 0.80
—————————-
ఏపీ & టీఎస్ = 13.00
—————————-

కర్ణాటక – 0.90

ఇతరప్రాంతాలు – 0.30

ఓవర్సీస్ – 1.80
———————————————
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ = 16.00
———————————————