రంగ్ దే లిరికల్ సాంగ్ టీజర్.. దేవిశ్రీ ప్రసాద్ ట్రాక్ లోకి వచ్చేసాడు.

నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుండి నితిన్ పెళ్ళి కానుకగా టీజర్ రిలీజైంది. టీజర్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుండి లిరికల్ సాంగ్ టీజర్ రిలీజ్ చేసారు. ఎమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది.. తనువాగనన్నది. అనే లిరిక్స్ కి నెమ్మదిగా సాగే ట్యూన్ తో ఆకట్టుకునే ట్యూన్ ని ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్.

పూర్తి లిరికల్ సాంగ్ నవంబరు 7వ తేదీన రిలీజ్ చేస్తారట. ఈ టీజర్ వింటుంటే దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసినట్టే అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతంపై చాలా విమర్శలు వచ్చాయి. కొత్తదనం కొరవడిందంటూ కొట్టిన ట్యూన్లనే కొడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాయి. కానీ రంగ్ దే సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసేలా ఉన్నాడు. మొత్తానికి రంగ్ దే చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయనడంలో సందేహం లేదు.