భారత్‌పై జో బైడెన్ గెలుపు ఎఫెక్ట్..భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..!

-

అమెరికా అధ్యక్ష రేస్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపుకు మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తున్న సమయంతో భారత మార్కెట్లు భారీ లాభాలలో ముగిశాయి..సెన్సెక్స్ 724.02 పాయింట్లు పెరిగి 41,340.16 వద్ద ముగిసింది; నిఫ్టీ 211.80 పాయింట్లు పెరిగి 12,120.30 వద్ద ముగిసింది..దీంతో జో బైడెన్ గెలుపుపై మార్కెట్ వర్గాలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది..ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంలో మార్కెట్ వర్గాలు కాస్తా సందిగ్ధంలో ఉన్నప్పటికి ఫలితాలు చివరి దశకు చేరేకొద్ది మార్కెట్లో ఉత్సహం పెరిగింది..ఇప్పటి వరకూ ట్రంప్ ఖాతాకు 214 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు దక్కగా జో బైడెన్ కు 263 సీట్లు దక్కాయి..

అధ్యక్ష పదవి వరించాలంటే మొత్తం 538 సీట్లలో కనీసం 270 సీట్లు గెలవాల్సి ఉంటుంది..స్వింగ్ స్టేట్స్ గా పేరు పొందిన రాష్ట్రాలు జో బైడెన్ కే ఆధిక్యం కట్టబెట్టినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి..స్వింగ్ రాష్ట్రాలలో ఎవరిదీ పై చేయి అయితే వారే అధ్యక్షులు కావటానికి ఎక్కువ అవకాశం ఉన్నదని అమెరికాలో ప్రతీతి…జో బైడెన్ గెలుపు సూచనలు రావడంతో.. అనుకున్నట్లుగానే మార్కెట్లలో ఉత్సహన్ని సృష్టించింది..ఆసియా మార్కెట్లు ఒక్క సారిగా లాభాల్లో పయనించాయి..ఆరంభంలో కొంత వరకు ఒడిదిడుకులు ఎదుర్కొన్న మార్కెట్ సమయం ముగిసే వరకూ.. సెన్సెక్స్ 724 పాయింట్లు లాభాపడగా, నిఫ్టీ 211 పాయింట్లుపైగా లాభాల్లో ముగిశాయి.. బైడెన్‌ గెలుపు సూచనలతో ఆయన మద్దతుదారులు పండగ చేసుకుంటున్నారు. ట్రంప్‌ మద్దతుదారులు కన్నీళ్లు కారుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news