హవ్వ.. రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ .. గుడ్డ ముక్క లేకుండా ..

బాలీవుడ్ లో రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంట ఎంతో స్పెషల్ అని చెప్పవచ్చు. ఇక వీరిద్దరూ తమ కెరియర్ పరంగా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇక బాలీవుడ్ లో రణవీర్ సింగ్ ఒక సెన్సేషనల్ స్టార్ హీరోగా మారిపోయారు. ఎక్కువగా మాస్ , యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అయితే తాజాగా ఈ నటుడు చేసిన పనికి బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా షాక్ గురయ్యింది. ఇక అభిమానులను, నెటిజన్ లను సైతం ఆశ్చర్యపరిచేలా చేశారు. అసలు ఏం పని చేశారో? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రణవీర్ సింగ్ తాజాగా ఒక మ్యాగజైన్ కోసం తన న్యూడ్ ఫోటోషూట్ ను విడుదల చేయడం జరిగింది. తన ఒంటిపైన ఎటువంటి దుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఫోటోలు నిర్మోహామాటంగా ఫొటో లకు ఫోజులు ఇవ్వడంతో ఆయన అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఆయనకున్న లేడీ అభిమానులు సైతం మైండ్ బ్లోయింగ్ అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా ఒక బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.

నేను శారీరకంగా నగ్నంగా ఉండడం చాలా సులభం.. కానీ కొన్ని ప్రదర్శనలో నేను ఇలా కనిపిస్తాను అని తెలియజేశారు.. నేను ఎంతమంది ఉన్నా సరే ఇలా నగ్నంగా ఉండగలను ఈ విషయంలో నాకు ఎలాంటి సిగ్గు , బిడియం లేదని తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతున్నది. ఇక ఈ హీరో డేర్ నెస్ కి అభిమానులు సైతం ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. చూడడానికి నగ్నంగా కనిపించినా తనలో మాత్రం ఎలాంటి నగ్నత్వం లేని విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు రణవీర్ సింగ్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్చల్గా మారుతున్నాయి. మరి ఈ ఫోటోలను దీపిక పదుకొనే ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.