జబర్దస్త్ జోడీ.. సుధీర్ కు ముద్దు పేరు పెట్టిన రష్మి.

-

తెలుగు టెలివిజన్లో సుధీర్, రష్మిల జంట చాలా పాపులర్. తెరపై వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ వీరిద్దరు తెర మీద కనిపిస్తే, అమాంతం ఆగి చూసే వాళ్ళున్నారంటే వాళ్ళెంత ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు. తరచుగా వీరిద్దరి మధ్య గిల్లికజ్జాలు నడుస్తుంటాయి. తాజాగా అది ముద్దు పేరు పెట్టుకునేలా చేసింది. యాంకర్ రష్మీ, సుధీర్ కి ముద్దు పేరు పెట్టింది.

ఇక నుండి సుడిగాలి సుధీర్ ని సుట్టి అనే పేరుతో పిలుస్తానని తెలిపింది. తెలుగు టెలివిజన్ లో ప్రసారమయ్యే ఒకానొక షోలో ఈ విధంగా వెల్లడించింది. ఆ తర్వాత వీరిద్దరూ ఒక పాటకి స్టెప్పులేసారు. ఇదిలా ఉంటే, తామిద్దరూ తెర మీద మాత్రమే అలా కనిపిస్తామని, కనీసం వాళ్ళిద్దరి మధ్య పెద్దగా స్నేహం కూడా లేదని రష్మి ఇంతకుముందే చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news