ప్రేమ పేరుతో లైంగిక దాడి : జూబ్లీహిల్స్ లో యువతి ఆత్మహత్య

-

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు అమలు చేసినా.. మహిళలపై దాడులు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా.. రేప్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ దారుణాలకు హద్దు, అదుపులేకుండా పోతోంది. అయితే.. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని సూసైడ్ నోట్ రాసి.. మరీ ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం వేకువ జామున చోటు చేసుకుంది.

ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకున్న యువతి… లైంగికంగా వాడుకుని వేదిస్తున్నడాని ఓ లేఖ రాసింది. అతని టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ పేర్కొంది యువతి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. విషయం తెలియగానే… ఆ యువతి తల్లిదండ్రులు శోక సంద్రంలోకి వెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పిఎస్ లో యువతి తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నిమిత్తం… కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news