‘లైగర్‌’ సినిమాపై రష్మిక కామెంట్స్‌ వైరల్‌

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా తనకెంతగానో నచ్చిందని చెప్పింది. ‘గుడ్‌ బై’ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్‌ మీడియాతో రష్మిక కాసేపు ముచ్చటించింది. విజయ్‌ దేవరకొండతో తన రిలేషన్‌షిప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘‘విజయ్‌తో ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలు చేశాను. దీంతో మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఇప్పుడు అందరూ ‘రష్మిక విజయ్‌ దేవరకొండ’ అంటూ మా గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇక, విజయ్‌ నటించిన ‘లైగర్‌’ చిత్రాన్ని ఇటీవల చూశాను. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. నాకు మాస్‌ సినిమాలు చాలా ఇష్టం. ‘లైగర్‌’ చూస్తున్నప్పుడు.. విజిల్స్‌ వేశాను. డ్యాన్స్ చేశాను. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా ఎంతో నచ్చింది. విజయ్‌ అదరగొట్టేశాడు. ఫిట్‌నెస్‌పై అతడు ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వెల్‌డన్‌ విజయ్‌’’ అని రష్మిక చెప్పింది.