కోలీవుడ్ లో రష్మిక క్రేజ్

-

కన్నడలో కిరాక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ గా అవతరించిన హీరోయిన్ రష్మిక తెలుగులో ఛలో, గీతా గోవిందం వరుస సూపర్ హిట్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేవదాస్ సినిమా కాస్త అటు ఇటుగా ఉన్నా అమ్మడి కెరియర్ మాత్రం తెలుగులో సూపర్ స్ట్రాంగ్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక తమిళ స్టార్ హీరో విజయ్ అట్లీ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని టాక్ వచ్చింది.

విషయం ఆమె దాకా వెళ్లడంతో ఆ సినిమా నుండి తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని చెప్పింది. అంతేకాదు తమిళ ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ అంటూ త్వరలోనే తమిళ సినిమా చేస్తా అంటూ చెప్పుకొచ్చింది. ఇక విజయ్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తా అంటుంది రష్మిక. తెలుగులో లక్కీ హీరోయిన్ గా మారిన రష్మిక తమిళంలో ఎలాంటి క్రేజ్ సంపాదిస్తుందో చూడాలి.

తమిళ తంబీలు మాత్ర రష్మికకు గ్రాండ్ వెల్ కం చెప్పేందుకు రెడీగా ఉన్నారు. కోలీవుడ్ లో రష్మిక ఏ స్టార్ తో నటిస్తుందో చూడాలి. ఇప్పటికైతే వరుస తెలుగు సినిమాలతో అమ్మడు కెరియర్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version