గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, వ్యాపార,పారిశ్రామిక దిగ్గజాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా రతన్ టాటా ఇకలేరనే విషయం తెలిసి ఆయన మాజీ ప్రియురాలు, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘ఇక నువ్వు లేరని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా, రతన్ టాటాతో తాను డేటింగ్ చేశానని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయామని 2011లో హిందుస్తాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో సిమి వెల్లడించారు. ఓ ఇంగ్లీష్ సినిమాతో వెండితెరపై కనిపించడం మొదలెట్టిన ఆమె ఆ తర్వాత బెంగాలీ, బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు.