రవితేజ కెరియర్లో అతధిక బడ్జెట్ తో `డిస్కోరాజా`.. ఎంతో తెలుసా..?

-

మాస్ మహారాజా రవితేజ వరుస పరాజయాలతో డీలా పడ్డారు. వరుసగా డిజాస్టర్లు వచ్చినా ఆయనకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. క్రేజ్ కూడా తగ్గలేదు. ఈ క్రమంలో మరోసారి ‘డిస్కోరాజా’ వంటి విభిన్నమైన చిత్రాన్ని ఎంపిక చేసుకున్నారు. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సారి కథా పరంగాను.. బడ్జెట్ పరంగాను ఆయన తాజా చిత్రం ‘డిస్కోరాజా’ ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ సారి ఆయన తన మార్క్ ఎంటర్టైన్మెంట్ కి సైన్స్ ను యాడ్ చేసుకున్నాడు. అలాగే ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా కూడా ఇదే. ఈ సినిమా కోసం 34 కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు గ్లామరస్ హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ చేయడం మరో విశేషం. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవాలంటే ఘనమైన ఓపెనింగ్స్ ను సాధించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news