రామారావుగా ర‌వితేజ ఫ‌స్ట్ లుక్‌.. ఎమ్మార్వో పాత్ర‌లో మాస్ మ‌హారాజా!

-

మాస్ మ‌హారాజ ర‌వితేజ (raviteja) ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు. కొంత కాలంగా ప్లాపుల‌తో స‌త‌మ‌తమైన ఆయ‌న రీసెంట్‌గా క్రాక్‌తో దుమ్ములేపాడు. ఇండ‌స్ట్రీని షేక్ చేసేశాడు. దీంతో ఆయ‌న వ‌రుస‌గా సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఖిలాడీ మూవీ షూటింగ్ లో ఉండ‌గానే మ‌రో కొత్త డైరెక్ట‌ర్ శరత్‌ మాధవ దర్శకత్వంలో సినిమా ఇప్పుడు ఆస‌క్తిని రేపుతోంది.

ఈ మూవీ రవితేజకు 68వ సినిమాగా తెరకెక్కుతుండ‌గా.. ఇందుకు సంబంధించిన ర‌వితేజ ఫస్ట్‌ లుక్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసి స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. అలాగే పోస్ట‌ర్‌తో పాటు మూవీ పేరును రామారావు అని ప్రకటిస్తూ మూవీ మేక‌ర్స్ నిర్ణ‌యించారు.

అయితే ర‌వితేజ ఫ‌స్ట్ లుక్‌లో ఆన్‌ డ్యూటీ అనే క్యాప్షన్‌తో ఇస్తూ షూటింగ్ న‌డుస్తోంద‌నే ఇంటిమేష‌న్ ఇచ్చారు. ఇక ఇందులో మాస్ రాజా రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌ పాత్రలో క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న శాఖ‌లో జరిగే అవినీత‌పై ర‌వితేజ పోరాటం ఉంటుంద‌ని ఇప్ప‌టికే అర్థ‌మ‌వుతోంది. ఇక ఇలాంటి పాత్ర‌లో ర‌వితేజ న‌టించ‌డం ఇదే మొద‌టిసారి. ప్ర‌స్తుతం విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు మంచి క్రేజ్ వ‌స్తోంది. ఇందులో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version