రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

-

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్  బచ్చన్’. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే  షాక్, మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

బాలీవుడ్ మంచి విజయం సాధించినటువంటి రైడ్ మూవీకి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ఆగస్టు 15, 2024న విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 14న ప్రీమియర్స్ వేయనున్నట్టు సమాచారం. దీనిపై మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సి ఉంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరోవైపు ఆగస్టు 15న రామ్-పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ కూడా వస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news