మాస్ మ‌హారాజా తొలి థ్రిల్ల‌ర్‌కు టైటిల్ పెట్టేశారు!

-

 

త‌మిళ హిట్ చిత్రం `రాక్ష‌స‌న్‌` చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌‌‌తో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సైకో థ్రిల్ల‌ర్ ని అంతే గ్రిప్పింగ్‌గా రీమేక్ చేసిన ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ తాజాగా మ‌రో ఆఫ‌ర్‌ని ద‌క్కించుకున్నాడు. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ .. బాలీవుడ్‌కి చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. లాక్‌డౌన్ బిఫోర్ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిపారు కానీ ఆ త‌రువాత రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయ‌లేదు.

కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మించ‌నున్న ఈ మూవీ ప్రీలుక్‌ని తాజాగా చిత్ర బృందం శనివారం విడుద‌ల చేసింది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని కూడా ఈ ఆదివారం ఉద‌యం11:55 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌బోతున్నారు. అంతే కాకుండా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ఇదే రోజు ప్రారంభం కాబోతోంది. థ్రిల్ల‌ర్‌తో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న ర‌మేష్‌వ‌ర్మ ఈ చిత్రాన్ని కూడా థ్రిల్ల‌ర్ కథాంశంతోనే చేయ‌బోతున్నాడు.

మాస్ మ‌హారాజా తొలిసారి న‌టిస్తున్న థ్రిల్ల‌ర్ కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఓ త‌మిళ హిట్ ఫిల్మ్ ఆధారంగానే ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. మీనాక్షీ చౌద‌రి, డింపుల్ హ‌యాతి హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి `కిలాడీ` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. ఇదే టైటిల్‌ని ఆదివారం ప్ర‌క‌టించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version